రైళ్లలో, బస్సులో ప్రయాణించేప్పుడు కొందరు తుంటరి కుర్రాళ్ళు స్టంట్లు చేస్తుంటారు. ఫుట్ బోర్డ్‌లో ప్రయాణం చేయడం, రైలు డోర్ దగ్గర కూర్చోవడం, డోర్‌ని పట్టుకొని వేళ్ళాడడం వంటివి చేస్తుంటారు. తోటి ప్రయాణికులు అలా చేయడం ప్రమాదకరమని హెచ్చరించిన పట్టించుకోరు. ఈ విధంగా ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు.
ఫుట్ బోర్డింగ్ ఎంత డేంజర్ అంటే కొన్ని సార్లు ప్రాణాల మీదికే తీసుకొస్తుంది. అయితే ఈ వీడియో లో ఒక యువకుడు ట్రైన్ డోర్ వద్ద వేలాడుతూ కింద పడిపోయాడు. అదృష్టవశాత్తూ బ్రతికినా, ఇది చాల డేంజర్ అని చెబుతున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్. ఈ యువకుడు త్రుటి లో చావుకి దగ్గరగా వెళ్ళాడు. ఊరికి వెళ్ళేపుడైనా, వచేప్పుడైనా, ఇలాంటి ప్రయాణం చాల ప్రమాదకరం.
A missed call to death.
Never ever do this either in bus or in train. pic.twitter.com/UFfylIQkfX— CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) February 18, 2020