వింత: కేకుని తింటే అదే పరిస్థితి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే….!

-

ఏదో సినిమా స్టోరీలా ఉంది ఈ వింత వ్యాధి. పూర్తిగా చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. సహజంగా మనం కేకుని తింటూనే ఉంటాం. ఏదైనా పార్టీస్ లో లేదా ఇళ్లల్లో చేసుకుని కూడా తింటూ ఉంటాం. అయితే కేక్ తినడం వల్ల మాత్రం ఏమి కాదు. కానీ ఒక వ్యక్తి మాత్రం కేక్ తింటే వింత జరుగుతోంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్ కి చెందిన ఆ వ్యక్తి పేరు కార్సన్. అతని వయసు 62 సంవత్సరాలు, లోలోఫ్ట్ లోని సఫోల్క్లో నివసిస్తున్నాడు.

కేక్ తింటే చాలు అతని శరీరం లో ఓ వింత జరుగుతోంది. కేక్ తినప్పుడల్లా అతడి కడుపులోకి వెళ్లి మద్యంలా మారిపోతుంది. ఇలా అతనిని ఆటో బ్రూవరీ సిండ్రోమ్ సమస్య వేధిస్తోంది. ఇలా ఇతను కేక్ తిన్న ప్రతీ సారి అది మద్యంగా మారుతోంది. దీనికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ఇతను గతంలో రసాయన కర్మాగారం లో పని చేశాడు.

అక్కడ 2003 సంవత్సరంలో పని లో ఉన్నప్పుడు బలమైన ఫ్లోరింగ్ ద్రావకం వాసన పీల్చాడు. దీని కారణంగా శరీరం లో ఇలాంటి మార్పు రావడం జరిగింది. దాని మూలం గానే ఈ మార్పు చోటు చేసుకోవడం జరిగింది. కానీ ఇంతకు ముందు ఇది లేదు. ఇతను చాలా సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు కూడా. తన బాధ చెప్పడం తో ప్రభుత్వం అతనికి ఓ సర్టిఫికెట్ ఇవ్వనున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news