భార్యాభర్తలు పెళ్లి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. సరైన కమ్యూనికేషన్ కూడా వాళ్ళ మధ్య ఉండాలి. భార్యాభర్తల మధ్య కొంత మంది రహస్యాలు ఉండకూడదు అంటారు. కానీ కొన్ని రహస్యాలు ఉంటేనే మంచిదట. ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యకు భర్త ఈ విషయాలని చెప్పకూడదు. మరి భార్య భర్తతో.. మరి భర్త భార్యతో ఎలాంటి విషయాలని చెప్పకూడదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
కొన్ని సార్లు డబ్బుని వాళ్ళకి తెలియకుండా దాచడం మంచిది. కుటుంబం ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఆ డబ్బును ఉపయోగించాలి. చెడు మార్గంలో పెట్టకూడదు.
అలాగే మనలో చాలామందికి గత తాలూకా ప్రేమలు ఉంటాయి. వాటికి సంబంధించిన విషయాలను మాట్లాడకూడదు. అలాగే మాజీ ప్రేయసితో మీకు నచ్చే క్వాలిటీస్ ని చెప్పి ఆమెను మార్చుకోమనడం వంటివి చెప్పకూడదు.
మనలో ప్రతి ఒక్కరికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఎవరు ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోలేరు. అలాంటి విషయంలో ప్రతిసారి పార్ట్నర్ కి చెప్పకూడదు. ఒకసారి చెప్పి వదిలేయడం మంచిది.
అందరూ అందరికీ నచ్చాలని రూల్ లేదు. అందరూ అందరికీ నచ్చరు కూడా. ఆమె కుటుంబంలో, బంధువుల్లో ఎవరికైనా నచ్చకపోతే ఆ విషయాన్ని వారికి చెప్పొద్దు. దీని వలన గొడవలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇద్దరికీ రిలేషన్స్ ఉంటాయి. వాళ్ళ బంధువులు అంటే మీకు ఇష్టం లేకపోతే అది వాళ్లకు చెప్పదు. ఆ విషయాన్ని వదిలేయండి గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాలను మీ భార్యతో చెప్పొద్దు. అనవసరంగా ఇబ్బందుల్లో పడాల్సి ఉంటుంది.