కొత్త వాళ్ళని ఎలా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు ..?

-

సాధారణంగా కొన్ని కొన్ని సార్లు మనం ఫ్రెండ్స్ ని ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాము. కాలేజీ మారినా కొత్త ఉద్యోగం లో చేరినా లేదా కొత్త ప్రదేశానికి వెళ్ళినా… ఎలా ఇతరులతో స్నేహం చేయాలి అనే విషయం చాలా మందికి తెలియదు. కానీ వాళ్లని స్నేహితులుగా చేసుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇది అనుసరించడం వల్ల మీరు సులువుగా ఎదుటి వాళ్ళని మీ ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే దీని కోసం పూర్తిగా చూసేయండి.

కాఫీ ట్రీట్:

ఎవరితోనైనా మీరు స్నేహం ఏర్పాటు చేసుకోవాలంటే వారితో సరదాగా బ్లైండ్ డేట్ టైప్ లో వెళ్ళండి. దీనివల్ల కాసేపు సరదాగా మాట్లాడుకోవడం వల్ల మీరు స్నేహితులు అవ్వగలరు.

సందర్భాన్ని బట్టి స్నేహితులు చేసుకోవడం:

సాధారణంగా మీరు మీకు నచ్చిన ప్రోగ్రాంకి వెళ్ళిన లేదంటే ఏవైనా సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నా చాలా మంది మీ తోటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అచ్చం మీలా ఆలోచించే వాళ్ళు, లేదంటే మీ హాబీస్ కి తగ్గినట్టు వాళ్లు అక్కడ ఉండే ఉంటారు. అటువంటి వాళ్ళ తో సరదాగా మీరు మాట్లాడితే ఎంతో సులువుగా మీరు వాళ్ళతో స్నేహం చేసేయొచ్చు.

మాట్లాడడం మొదలు పెట్టండి:

సాధారణంగా మనకి ఎవరైనా ఎదుట పడితే నవ్వుతూ ఉంటాము. కానీ మాట్లాడము. నవ్వుతో పలకరిస్తే స్నేహితులు అవ్వరు. కాబట్టి వాళ్లతో మీరు క్లోజ్ గా మాట్లాడడానికి ట్రై చేయండి. దీనితో వాళ్ళు మీ ఫ్రెండ్స్ అవ్వగలరు.

Read more RELATED
Recommended to you

Latest news