ప్రతి ఒక్కరికి తమ పై తమకు నమ్మకం ఉండడం చాలా అవసరం. దీనినే మనం ఆత్మ విశ్వాసం అని అంటాము. దీనిని ఇంగ్లీషు లో self confidence అని అంటారు. నేను చేయగలను, నాకు ఇది సాధ్యం…. అది అనుకునేది ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం లేకపోతే ఎందులోని రాణించ లేరు. ప్రతి ఒక్కరికి ఆత్మవిశ్వాసం మంచి దారి చూపిస్తుంది. ఆత్మవిశ్వాసమే దేనిని సాధించడానికి అయినా ఎంత గానో తోడ్పడుతుంది. మనలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇతరులకు కూడా ఆత్మ విశ్వాసాన్ని నింపగలదు. విజయం సాధించిన వారికి సాధించని వారికి మధ్య తేడా ఆత్మవిశ్వాసమే అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అయితే ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుకోవాలంటే వీటిని చూడాల్సిందే.

ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుచుకునే కొన్ని అంశాలు:
ఎవరైనా మంచి పనులు చేసేటప్పుడు వారికి కొన్ని మాటలు చెప్పాలి.
ఎప్పుడూ ముందు వరుసలోనే కూర్చోవాలి.
వేదిక పైన మాట్లాడగలగాలి.
మంచి ఉపన్యాసాలు వినాలి.
ఇతరులను గౌరవించాలి.
కాస్త తొందరగా నడవాలి.
చూడగానే ఆకట్టుకునే విధంగా వస్త్రధారణ ఉండాలి.
మన పని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలి.