సోషల్‌ మీడియా, వీడియో గేమ్‌లతో పిల్లల తెలివితేటలు పెరుగుతున్నాయంటున్న సర్వే..!

-

ఇప్పుడు చిన్నపిల్లలకు చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు..మారం చేయకుండా తింటారు. మీరు వాళ్లను ఎక్కడికైనా తీసుకెళ్లండి ఫోన్‌ మాత్రం కచ్చితంగా కావాలంటారు. వీళ్లకు తోడు.. ఇప్పుడు ఆన్లైన్‌ క్లాసులు అవడం వల్ల.. వారికి ఫోన్‌ ఇంకా దగ్గరైంది. ఇంకేముందు.. అప్పటివరకూ.. ఫోన్‌ కండీషన్‌ బేస్‌ మీద ఇచ్చే తల్లిదండ్రులు ఇప్పుడు చచ్చినట్లు వాళ్లకు ఫోన్‌ ఇవ్వాల్సి వచ్చింది. క్లాసుల సంగతి దేవుడెరుగు..చాలమంది.. ఫోన్లలో వీడియోగేమ్స్‌ ఆడుతూ గంటలు గంటలు గడిపేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో కూడా పిల్లలు ఎక్కువ సమయం గడుపుతున్నారు. పెద్దలే సోషల్‌ మీడియాను వదల్లేక పోతున్నారు.. ఇక పిల్లలు వాడటంలో తప్పులేదులేండి.! గంటలు, రోజుల తరబడి సోషల్ మీడియాలో గడిపేస్తుంటారు కొందరు. అయితే సామాజిక మాధ్యమాలు, వీడియో గేమ్స్‌ పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్న అంశంపై పియర్‌సన్‌ గ్లోబల్‌ లెర్నర్స్‌ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఏప్రిల్‌ నెలలో అమెరికా, బ్రిటన్‌, బ్రెజిల్‌, చైనాతోపాటు భారత్‌ ఈ సర్వే చేశారు.

మనం సాధారణంగా.. పిల్లలకు ఫోన్‌కు ఎక్కువ దగ్గరవడం వారి ఆరోగ్యానికి మంచిది కాదనుంటాం. కానీ సర్వేలో భాగంగా మొత్తం 3100 మంది తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీడియో గేమ్స్‌ కూడా పిల్లల పై సానుకూల ప్రభావమే చూపిస్తోందని, వీడియో గేమ్‌లు పిల్లల మానసిక సామర్థ్యాన్ని పెంచుతాయని ఈ సర్వేలో పాల్గొన్న 40శాతం మంది తల్లిదండ్రులు వెల్లడించారు. అంతేకాకుండా సోషల్ మీడియా వల్ల ఇదే విధమైన ప్రభావం ఉన్నట్లు, సోషల్‌ మీడియాతో పిల్లల తెలివితేటలు పెరుగుతాయని 30శాతం మంది తల్లిదండ్రులు చెప్పడం విశేషం. అయితే పాఠశాలలు ఆన్‌లైన్‌, వర్చువల్‌ పద్ధతిలో బోధన తగ్గించాలని సర్వేలో పాల్గొన్న 80శాతం మంది తల్లిదండ్రులు పేర్కొన్నారు.

మొత్తానికి సర్వేలో రిజల్ట్‌ ఇలా వచ్చింది. అవును.. సోషల్‌ మీడియా, వీడియో గేమ్స్‌ వల్ల పిల్లల బ్రెయిన్‌ యాక్టివ్‌గా ఉంటుంది. చురుకుగా పనిచేస్తారు. అయితే రోజులో ఎక్కువసేపు కాకుండా.. నిర్థిష్ట టైం వరకే వారికి ఫోన్స్‌ ఇవ్వాలి..అప్పుడే అన్నీ బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతారు. అలవాటు వ్యసనం కానంతవరకే ఏదైనా బాగుంటుంది.!

Read more RELATED
Recommended to you

Latest news