ముల్లు ఆకు మీద పడినా ఆకు ముల్లు మీద పడినా పోయేది ఆకే

-

 

ముల్లు ఆకు మీద పడినా ఆకు ముల్లు మీద పడినా పోయేది ఆకే,, ఉండిపోయేది ముల్లే.

ఆకు అనగా అమ్మాయి, ముల్లు అనగా అబ్బాయి… పోయేది ఆకే అంటే ఫైనల్గా యూ.ఎస్.ఎ పోయేది అమ్మాయే,, ఇక్కడ ఉండిపోయేది ముల్లు అంటే అబ్బాయి…

దీని అర్ధమేమిటంటే ,,చదువుకునే రోజుల్లో అబ్బాయిలూ,, అమ్మాయిలూ కలిసి కబుర్లు చెప్పుకుంటారు సరదాగా గడుపుతారు…

అయితే కాలేజ్ అయ్యాక,, ఇంటికెళ్ళిపోయాక అమ్మాయిలు చదువు ధ్యాసలో పడిపోతారు…బాగా మార్కులు సంపాదిస్తారు,,ఇంటర్యూలో సెలక్ట్ అయ్యి అమెరికా పోతారు,,లేదా అబ్బాయిలతో పోలిస్తే జి.ఆర్.ఇ లాంటి పరీక్షలలో 30-40 శాతం తక్కువ స్కోర్ వచ్చినా అమెరికాలో మంచి యూనివర్సిటీలలో సీట్లు సంపాదించి అమెరికా పోయేది ఆకే !! లేదా అమెరికాలో సెటిల్ అయిన ఒక స్మార్ట్ గ్రీన్ కార్డ్ హోల్డర్ని మేరేజీ చేసుకుని ఆకు అమెరికాకి పోతోంది !! ఐ.టీ రంగంలో కూడా అమ్మాయిలే ఎక్కువగా ఉంటున్నారు… ఉండిపోయేది ముల్లే

సాయంత్రందాకా కాలేజీలో చెప్పుకున్న సోది కబుర్లను ఇంటికెళ్ళి 4 గంటలపాటు గేదెలా నెమరేసుకుని,,ఏవేవో పిచ్చిపిచ్చిగా ఇష్టమొచ్చినట్లు ఊహించుకుని,, మన బేవార్స్ ఫ్రెండ్స్ అందరితోనూ ఓ ఉప్పర్ మీటింగ్ పెట్టి,, పార్టీలిచ్చేసి రాత్రి పుస్తకంపై ధ్యాస పెట్టక పరీక్షలలో చీదుతున్నారు మన అబ్బాయిలు..

కొంతమందైతే అమ్మాయితో 10 నిమిషాలు మాట్లాడితే చాలు,,పుట్టబోయే కొడుకుకి పేరు కూడా పెట్టేసుకుంటున్నారు

అమ్మాయిలతో మాట్లాడిన విషయాలూ,, గడిపిన సమయం,, చెప్పుకున్న సొల్లుకబుర్లు సూర్యచంద్రులవలె శాశ్వతమైనవని భావించి సప్లిమెంటరీ ఎగ్జాంస్ రాసుకుంటూ కాలేజీలోనే ఉండిపోతోంది ముల్లు… ఇంతా చేస్తే వాడిచ్చే బోడి పార్టీ ముష్టి 10 రూపాయల కూల్డ్రింక్… దానికోసం మరో 10 మంది తమ జీవితాలనూ,, కాలాన్నీ ” కాయ్ రాజా కాయ్ ” అని పణంగా ఒడ్డి సర్వ నాశనం చేసుకుంటున్నారు…

కాబట్టి అబ్బాయ్ !!!
సొల్లు కబుర్లూ, పిచ్చిపిచ్చి వేషాలూ వేస్తే నీ కళ్ళెదురుగానే అమ్మాయిలు దేశాలన్నీ చుట్టొచ్చేస్తూంటే నువ్వు మాత్రం పిచ్చోడిలా,, వెర్రి వెంగళప్పలా, బేవార్స్లా గాలి తిరుగుడు తిరుగుతూ అందరిచేతా ‘ చీ ‘ కొట్టించుకుంతూ పరమ దరిద్రమైన,, నీచ,నికృష్ఠమైన కమీనా కుక్క బ్రతుకు గడపవలసి వస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news