మనం ప్రేమించిన వ్యక్తిని పొందడం అంత ఈజీ కాదు. చాలా మంది లవ్ లో పడతారు కానీ కొందరు మాత్రమే ఆ లవ్ లో సక్సెస్ పొందుతారు. అలానే లవ్ లో పడిన తర్వాత ఆనందంగా ఉన్న జంటలు కూడా చాలా తక్కువ మంది మాత్రమే. అయితే ప్రతి ఒక్కరికి కూడా లవ్ లో పడిన తర్వాత కూడా సందేహాలు ఉంటాయి.
నిజంగా ఆ అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని పదే పదే ఇలా అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా ఇదే డౌట్ ఉందా..? అయితే ఈ సంకేతాల ద్వారా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఒకవేళ కనుక మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లయితే ఇవి మీ రిలేషన్ షిప్ లో కనపడతాయి.
మానసిక భావోద్వేగ అవసరాలను తీరుస్తాడు:
మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఎప్పుడు మిమ్మల్ని మానసికంగా ఆనందంగా ఉంచుతాడు మిమ్మల్ని ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి చూస్తాడు. మీ అవసరాలని తీరుస్తాడు.
ప్రామిస్ ని నిలబెట్టుకుంటాడు:
నిజంగా ప్రేమించే వ్యక్తి ప్రామిస్ ని నిలబెట్టుకుంటాడు .చెప్పిన మాటల్ని మర్చిపోడు. ఒకవేళ కనుక మీ ప్రియుడు కూడా ఇచ్చిన ప్రామిస్ లని నిలబెట్టుకుంటున్నట్లయితే కచ్చితంగా అది ట్రూ లవ్ ఏ.
కుటుంబ సభ్యులకి పరిచయం చేస్తాడు:
వాళ్ళ కుటుంబ సభ్యులకి మీ ప్రియుడు పరిచయం చేసినట్లయితే అది నిజంగా ట్రూ లవ్ ఏ.
మీ ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో చెప్తాడు అలానే పెళ్లి గురించి కూడా చెప్తాడు. ఇలా మీ ప్రియుడు చెప్పినట్లయితే అది నిజం గా ట్రూ లవ్.
మీ ఇష్టాలని ప్రోత్సహిస్తాడు:
మీరు ఏం సాధించాలనుకుంటున్నారు మీ ఇష్టాలు ఏమిటి అనేది అర్థం చేసుకుని దానికి తగ్గ ప్రోత్సాహం అందిస్తాడు మీ ప్రియుడు. ఒకవేళ కనుక మీ రిలేషన్ షిప్ లో ఇవన్నీ ఉంటున్నట్లయితే ఖచ్చితంగా అది ట్రూ లవ్ ఏ. సందేహమే లేదు.