పాక్ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రావల్పిండి ఎక్స్ప్రెస్ పేరుతో తెరకేక్కుతున్న తన బయోపిక్ మూవీ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ ప్రకటించాడు.
‘కొన్ని నెలలుగా మేకర్స్ తో విభేదాలు వచ్చాయి. ఈ ప్రాజెక్టులో కొనసాగాలని చాలా ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. బయోపిక్ నుంచి వైదొలగడం బాధగా ఉంది. నా అనుమతి లేకుండా మూవీనీ తెరకేక్కిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను అని ట్విట్ చేశారు.