అందుకే నా సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి అంటున్న ప్రశాంత్ నీల్…..

-

కేజిఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మిగతా అభిమానులు కూడా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 22వ తేదీన భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ మరియు ట్రైలర్స్ కి మంచి స్పందన వస్తుంది.

 

విడుదల తేదీ దగ్గరపడుతు ఉండడంతో సినిమాపై హైట్ క్రియేట్ చేసేందుకు చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూ లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో… తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ప్రశాంత్ నీల్ సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నాడు. ఉగ్రం సినిమా నుంచి ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమాలన్నీ బ్లాక్ అండ్ వైట్ లోనే ఉన్నాయి. దీంతో అభిమానులు ప్రశాంతి నీల్ ని అన్న నువ్వు ఎప్పుడు వేరే కలర్స్ వాడవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.దీనికి సమాధానం చెబుతూ తనకు ఓసిడి ఉందని ఎక్కువ కలర్స్ చూసినప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news