Telangana: రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్ ల బదిలీ…..

-

ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. డిజిపిగా రవి గుప్తా మరో సంవత్సరంనర కొనసాగానున్నాడు. అంజని కుమారుని రోడ్డు భద్రత విభాగం చైర్మన్ తో పాటు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

 

 

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా రాజీవ్రతన్ ని ,రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్త్,ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ ,సీఐడీ డీఐజీగా రమేష్ నాయుడు,జైళ్లశాఖ డీజీగా సౌమ్య మిశ్రా ,మధ్య మండల డీసీపీగా శరత్చంద్ర పవార్,సీఏఆర్ హెడ్క్వర్టర్స్ సంయుక్త కమిషనర్గా సత్యనారాయణ,ఆబ్కారీ శాఖ డైరెక్టర్గా కమలాసన్ రెడ్డి, టీసీపీఎఫ్ అదనపు డీజీగా అనిల్ కుమార్,

హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించి ప్రభుత్వం.. అదనంగా వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ విభాగాన్ని అప్పగించింది.ఏసీబీ డైరెక్టర్ గా ఏఆర్ శ్రీనివాస్ ,ఐజీ పర్సనల్ చంద్రశేఖర్రెడ్డి,రైల్వే డీజీగా మహేశ్ భగవత్,ఇంటెలిజెన్స్ బ్యూరో డీఐజీగా బి. సుమతి,హైదరాబాద్ మల్టీ జోన్ ఐజీ-2గా తరుణ్ జోషి, హైదరాబాద్ మల్టీ జోన్-1 ఐజీగా జోషికి అదనపు బాధ్యతలు అప్పగించారు.తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఎం.రమేష్,సీఐడీ అదనపు డీజీగా శిఖా గోయల్ నియమితులయ్యారు. శిఖా గోయల్కు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news