కీసర సమీపంలో మరో డేరాబాబా?

-

కీసర గోదుమకుంటలో ఓమోజయ బాబా ఆశ్రమం ఎదుట  ఆందోళన

మేడ్చేల్ – మల్కాజ్ గిరి జిల్లా జిల్లా కీసర గోదుమకుంటలో ఓమోజయ బాబా ఆశ్రమం ఎదుట  హిందూవాహిని కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. మహిళలకు డ్రగ్స్ ఇస్తున్నారంటూ ఆశ్రమం పై తీవ్ర ఆరోపలున్న నేపథ్యంలో కొన్ని రోజుల కిందట బీటెక్ విద్యార్థిని చందనను ఆమె తల్లి ఆశ్రమంలో వదిలి వెళ్లారట. అయితే ఇప్పుడు తమ కూతుర్ని చూపించేందుకు ఆశ్రమవాసులు నిరాకరించడంతో ఆమె తల్లీదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. కేసు నమోదు చేసిన కుషాయిగూడ ఏసీపీ ఆధ్వర్యంలో పోలీసులు ఆశ్రమాన్ని చుట్టుముట్టారు. ఓవైపు హిందూ వాహిని కార్యకర్తలు, మరోవైపు పోలీసులు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆశ్రమం నిర్వాహకులు తలుపులు మూసి తాళాలు వేయడంతో అనుమానాలకు మరింత బలం చేకూరింది.

Read more RELATED
Recommended to you

Latest news