కేసీఆర్ గుండె చీల్చితే కనిపించేది తెలంగాణ! : కేసిఆర్

-

భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…’బేటీ పడావో.. బేటీ బచావో అన్నారు .

ఏ బేటికి అయినా పడాయించారా.. ఏ బేటిని అయినా బచాయించారా, మొత్తం ఎక్కడ చూసినా మహిళల పట్ల దౌర్జన్యాలు జరుగుతున్నాయి అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

బీజేపీ పాలిత రాష్ట్రాలలో దేశ వ్యాప్తంగా వార్తలు చూస్తే కళ్ళల్లో నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది అని మండిపడ్డారు.ఒకడేమో బీఆర్ఎస్, బీజేపీకి బీ-టీమ్ అంటాడు.. ఇంకొకడు బీఆర్ఎస్, కాంగ్రెస్‌కి బీ-టీమ్ అంటాడు.కానీ భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్‌ను దించి భువనగిరి చైర్మన్‌గా కాంగ్రెస్ వాడు, వైస్ చైర్మన్‌గా బీజేపీ వాడు కూర్చున్నారు అని కేసీఆర్ అన్నారు.కేసీఆర్ గుండె చీల్చితే కనిపించేది తెలంగాణ.నాకు శక్తి ఉన్నంతవరకు తెలంగాణలో రైతులకు గాని, ఎవరికైనా గాని అన్యాయం, మోసం జరిగితే.. భూమి ఆకాశం ఒక్కటి చేసైనా పోరాడుతా అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news