జిహెచ్ఎంసి పరిధిలో ప్రజా పాలన నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. 150 డివిజనులలో ప్రజా పాలన కార్యక్రమాలను నిర్వహించి ఆరు గ్యారెంటీ పథకాలను తప్పకుండా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… ప్రజా పాలనలో స్వీకరించే దరఖాస్తులను నిశితంగా పరిశీలిస్తామని అన్నారు. గత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులను చేర్చడంగానీ పాత రేషన్ కార్డులను తొలగించడం కానీ చేయలేదని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి విధివిధానాలు ఖరారు ఇంకా పూర్తి కాలేదని త్వరలోనే లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలను రూపొందిస్తామని అన్నారు. పింఛన్ తీసుకునేవారు మరల దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని … ప్రజావాణిలో ఇప్పటివరకు 25వేల అప్లికేషన్లు వచ్చాయని శ్రీధర్ బాబు వెల్లడించారు.