గుంటూరులో రోడ్డుపైకి మొస‌లి..లారీ డ్రైవ‌ర్ షాక్..!

గుంటూరు జిల్లాలో రోడ్డుపైకి మొస‌లి రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. రాజుపాలెం మండలం అనుపాలెం చెప్టా వద్ద మొసలి లారీ కింద పడి చనిపోయింది. మొసలి వాగు నుండి బయటకు వచ్చి రోడ్డు దాటుతుండ‌గా ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవర్ చూసుకోకుండా ముసలిని ఎక్కించగా అది చనిపోయిన తర్వాత దిగి చూసేస‌రికి మొస‌లి క‌నిపించ‌డంతో షాక్ అయ్యాడు. ఇక స్థానికుల సమాచారంతో అటవీ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. స్థానికులు మాత్రం ఈ ఘటనపై ఆందోళన చెందుతున్నారు. మొస‌ళ్లు భ‌య‌ట‌కు రావ‌డంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరిన్ని మోసాలు కూడా బయటకు వచ్చాయి అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొస‌లి బయటకు వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.