ముగిసిన కేంద్ర జలశక్తి మంత్రితో కేసీఆర్ సమావేశం : వీటిపైనే చర్చ

కాసేపటి క్రితమే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకవత్ తో సిఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. సుమారు 40 నిముషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈనెల 6 న కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమైన కేసీఆర్.. గత సమావేశం లో చర్చించిన అంశాలే మరలా చర్చించినట్లు సమాచారం తెలుస్తోంది. . గతంలో ప్రస్తావించిన 5 అంశాల పై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకవత్ కి ఇవాళ విజ్ఞాపనపత్రం ఇచ్చారు సీఎం కేసీఆర్.

గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణ ఏర్పడక ముందే ప్రారంభించిన 11 ప్రాజెక్టులను కేంద్రం జారీ చేసిన గెజిటి నోటిఫికేషన్ లో అనుమతి లేని ప్రాజెక్చులుగా పేర్కొన్నారని అభ్యతరం వ్యక్తం చేశారు. రాష్టానికి కేటాయించిన 967.94 టి.ఎంసీల నీటి పరిధిలోనే ప్రొజెక్టులు ఉన్నాయని, అందులో 758.76 టిఎంసీల వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం ఇప్పటికే అనుమతులు ఇఛ్చిందని తెలిపారు కేసీఆర్.

మరో 148.82 టీఎంసీల సంబంధించి నీటి లభ్యత పై హైడ్రోలజీ డైరెక్టరేట్ అనుమతులు మంజూరు చేసిందని లేఖలో పేర్కొన్న సీఎం… చిన్న నీటి పారుదల పధకమైన కందుకుర్తి ఎత్తిపోతల పధకం 3300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తున్నదని వెల్లడించారు. దీనికి అనుమతులు అవసరం లేదన్న కేసీఆర్… రామప్ప పాకాల లింక్, తుపాకులగూడెం బ్యారేజ్ దేవాదుల ఎత్తిపోతల పథకం లో భాగం కాబట్టి కొత్తగా అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. కంతనపల్లి ప్రాజెక్టు ను కూడా అనుమతి లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తీసివేయాలని కోరారు కేసీఆర్.