తెదేపా నాయకుడు వల్లభనేని కారులో రూ.60 లక్షలు…

-

లెక్కకు చూపని రూ.60 లక్షల నగదుని హవాలా ద్వారా జగిత్యాల జిల్లాకు కారులో తరలిస్తున్న ఘటనలో తెలుగు యువత అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌తో పాటు ఆయన కారు డ్రైవర్ మహేశ్ ని సెంట్రల్ జోన్ పోలీసులు  అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని డబ్బు స్వాధీనం చేసుకున్నారు.  అనిల్ ఆదేశంతోనే  డబ్బును జగిత్యాలకు తరలిస్తున్నట్టు కారు డ్రైవర్ మహేశ్ పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news