నేటి నుంచి విశాఖలో ఫిన్‌టెక్ ఫెస్టివల్ జరగనుంది. దేశంలోనే తొలిసారిగా ఫిన్‌టెక్ ఫెస్టివల్ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు రోజుల పాటు ఈ ఫెస్టివల్‌ని నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న ఆర్థిక విధానాలుకు అనుగుణంగా, ఆర్థిక రంగంలో సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా అంతర్జాతీయ కంపెనీలకు రాష్ట్రానికి ఆహ్వానించడమే లక్ష్యంగా ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మిలియన్ డాలర్ ఛాలెంజ్‌కు రూపకల్పన చేస్తున్నారు. ఫిన్ టెక్ ఫెస్టివల్లో ప్రపంచ తొలి హ్యూమనాయిడ్ రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రపంచ నలుమూలల నుంచి వివిధ సంస్థల ప్రతినిథులు రానున్న సందర్భంగా విశాఖ నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచి వైజాగ్ లో ఫిన్ టెక్ ఫెస్టివల్
-
Previous article
Next article