టెక్నాలజీ పెరిగినా మన దేశంలో ఇంకా కట్నం జాడ్యం మాత్రం వీడలేదు. ఇంకా కట్నం కట్నం అంటూ వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో కట్నం అనే వ్యవస్థ వేళ్లూనుకుంది. ఇది అంత తొందరగా వదిలేది కాదు. ప్రతి వ్యక్తి నరనరాన నాటుకుపోయింది. తాజాగా కట్నం అడిగి ఓ పెళ్లి కొడుకు అడ్డంగా బుక్కయ్యాడు. పెళ్లి చూపులప్పుడు నేను శుద్ధపూసను.. నాకు కట్నం వద్దు అని చెప్పిన పెళ్లి కొడుకు.. పెళ్లి సమయంలో మాత్రం అడ్డం తిరిగాడు. మోటర్ సైకిల్, బంగారు గొలుసు కొనిస్తేనే పెళ్లి చేసుకుంటా అని తెగేసి చెప్పాడు. దీంతో తమ వద్ద అన్ని డబ్బులు లేవని.. అవి ఇచ్చుకోలేమని పెళ్లి కూతురు తరుపు వాళ్లు చెప్పారు. దీంతో పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పాడు ఆ పెళ్లి కొడుకు. ఇంతపనికొస్తావా.. అని అతడిని కట్టేసి సగం గుండు కొట్టించి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
కట్నం అడిగాడని వరుడికి సగం గుండు కొట్టించారు..!
By Anil Kumar
-
Previous article