ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరం ప్రారంభం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఘట్టాని కంటే ముందు పాలధార, అంజలి రథం, ఏనుగు రథం, బెస్తావాని వల నడుస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు మూడు లక్షల మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తారని ఆలయ కమిటీ పేర్కొంది. ఇప్పటికే సోమవారం నాడు ప్రధాన ఘట్టమైన తొలేళ్ల ఉత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త, ఎంపి పూసపాటి అశోక్‌గజపతిరాజు తన కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు రెండు వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ ఉత్సవంలో పైడితల్లి అమ్మవారి పూజరిని భగవంతునిగా భక్తులు కొలుస్తారు.