కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎస్టీబీసీ మైదానంలో లక్ష మందితో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణలో తెదేపా – కాంగ్రెస్ పొత్తు ఉంటుందన్న నేపథ్యంలో ఏపీలో రాహుల్ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏపీ పీసీసీ ఛీఫ్ రఘువీరారెడ్డి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశంపై రాహుల్ ప్రసంగించనున్నట్లు సమాచారం.
రాహుల్ పర్యటన షెడ్యూల్
- మంగళవారం మధ్యాహ్నం 12.15 గంటలకు స్థానికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకుంటారు.
- అక్కడి నుంచి నేరుగా మాజీ సీఎం దామోదర సంజీవయ్య ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో సమావేశమవుతారు.
- బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో పలు విషయాలపై చర్చించనున్నారు.
- 2.45 గంటలకు దివంగత సీఎం విజయ్ భాస్కర్ రెడ్డి సమాధి(కిసాన్ ఘాట్) వద్దకు చేరుకుని పుష్పాంజలి ఘటిస్తారు.
- సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.
- అనంతరం హైదరాబాద్ కు చేరుకుంటారు. తెలంగాణలో పొత్తులపై, సీట్ల సర్దుబాటుపై రాహుల్ స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.