జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైలు యాత్ర చేపట్టనున్నారు. నవంబర్ 2న విజయవాడ నుంచి తుని వరకు ట్రైన్ జర్నీ చేయనున్నట్లు జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 2న మధ్యాహ్నం 1.20 గంటలకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో పవన్ ప్రయాణం సాగనుంది…రైలులో ప్రయాణించి సాయంత్రం 5.20 గంటలకు తుని చేరుకుంటారు. ఈ ప్రయాణంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ… జనసేన పార్టీ ఆశయాలకు వారికి వివరించనున్నారు. ఈ నేపథ్యంలో జనసేనాని అధికారికంగా ఫేస్‌బుక్ పేజీని మంగళవారం ప్రారంభించి తొలి పోస్టుగా తుని రైలు ప్రయాణ వివరాలను విడుదల చేశారు. పర్యటన వివరాలు, పార్టీ సిద్ధాంతాలను నెటిజన్లకు వివరించేందుకు ఈ పేజీని ప్రారంభించినట్లు పవన్ తెలిపారు. ఏపీలో ఇప్పటికే వైసీపీ అధినేత జగన మోహన్ రెడ్డి ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో మొన్న ఎయిర్ పోర్ట్ లో ఆయన పై హత్యయత్నం జరిగిన విషయం తెలిసిందే… ఇలాంటి సమయంలో పవన్ యాత్రకు ఎలాంటి ఆటకం కలగకుండా ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
Hello everyone, I invite you to interact with me on a train journey from Vijayawada to Tuni on November 2nd. – @JanaSenaParty Chief @PawanKalyan #PawanKalyanOnFacebook pic.twitter.com/ROJW0Q0HyP
— JanaSena Party (@JanaSenaParty) October 30, 2018
JanaSena Chief @PawanKalyan opened his official Facebook account #PawanKalyanOnFacebook
Full Album : https://t.co/xViI7BCtW6 pic.twitter.com/DjFFGUVCsg
— JanaSena Party (@JanaSenaParty) October 30, 2018