GHMC స్టాండింగ్ కమిటీ ఎన్నికకు కార్పొరేటర్ల నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి వద్ద నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నాలుగు నామినేషన్లలో రెండు కాంగ్రెస్, రెండు బిఆర్ఎస్ తరపున దాఖలు అయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి నామినేషన్ దాఖలు చేయగా.. కాంగ్రెస్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన వేళల్లో హిమాయత్ నగర కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, రామచంద్రాపురం కాంగ్రెస్ కార్పొరేటర్ పుష్ప ఉన్నారు.
ఈ రోజే GHMC రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు కార్పొరేటర్లు. అయితే ఈ నెల 17 వరకు ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సాగనుంది. ఇక ఇన్నిరోజుల పాటు తమకు స్టాండింగ్ కమిటీ లో చోటు లేదని.. ఈసారి తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. అదే సమయంలో పార్టీలకు అతీతంగా బీజేపీ కార్పొరేటర్లు కూడా మాకు ఓటేస్తారంటున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు.