మాజీ ప్రధాని, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కు భారీ షాక్ తగిలింది.ప్రభుత్వ అధికారిక రహస్యాలు వెల్లడించిన కేసులో పాక్ మాజీ ప్రధాని ఇమ్రానఖాన్ కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.ఇమ్రాన్‌తోపాటు మాజీ విదేశాంగ మంత్రి, పీటీఐ వైస్ చైర్మన్ షా మహమూద్ ఖురేషీ కి కూడా 10 ఏళ్లు శిక్ష పడింది .
2022లో ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయే ముందు ఇమ్రాన్ ఖాన్ బహిరంగ ర్యాలీలో మాట్లాడుతూ….తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమెరికా కుట్రపన్నిందని,అమెరికా ఆదేశాలకు అనుగుణంగా పాకిస్థాన్ మిలిటరీ ప్రభుత్వం నడుచుకుంటోందని సభలో కొన్ని పత్రాలను బహిరంగంగా ప్రదర్శించారు. అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి వీటిని సేకరించానని తెలిపారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని జైలులో ఉన్నారు.