ప్రజా చైతన్యం ముందు అందరూకొట్టుకుపోయారు…కేటీఆర్

-

తెలంగాణ వంటి పోరాటల గడ్డపై కుళ్లు,కుంతంత్రాలు చెల్లవని ఇక్కడి ప్రజలు ఓటు ద్వారా నిరూపించారని మంత్రి కేటీఆర్తెలిపారు. తెరాస కార్యనిర్హాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి ఏర్పాటుచేసిన మీడియా సమావేంలో కేటీఆర్ మాట్లాడుతూ… ప్రజాబలం లేని ప్రజాకూటమిని రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని తెదేపా అధ్యక్షుడుచంద్రబాబు ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారు..వారి ప్రయత్నాన్ని ప్రజలుతిప్పికొట్టారన్నారు. ప్రజా చైతన్యం ముందు ఏ శక్తి నిలవలేదని మొన్నటి ఎన్నికల్లోమరోమారు రుజువైందని పేర్కొన్నారు. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిస్తే అక్కడఈవీఎంలలో ట్యాంపరింగ్‌ లేదట. అదే తెరాస గెలిచిన చోటే ఈవీఎంల్లో ట్యాంపరింగ్‌జరిగిందని ఆ పార్టీ నేతలు అనడం హాస్యాస్పదంగా ఉంది.

 బూత్‌ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీసంస్థాగత నిర్మాణం బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో 16 పార్లమెంటు స్థానాలను కైవసంచేసుకోవడమే… ఇప్పుడు తన ముందున్న లక్ష్యమని కేటీఆర్‌ పేర్కొన్నారు. యువతకుపెద్దపీట వేస్తే వాళ్లే వందేళ్లు తెరాసను కాపాడుకుంటారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలమేరకు పని చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version