ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాల హామీ ఇచ్చి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పిందని టిఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు.ఈ ఆరు హామీల విషయంలో ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఆరు పథకాల అమలు జరగాలని లేకపోతే ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదని అన్నారు .100 రోజుల్లోనే 6 గ్యారంటీల అమలు జరుగుతుందని చెప్పిన కాంగ్రెస్ పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని అన్నారు.
లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. హామీలు అమలు కాకపోవడానికి కారణం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అని వారు సమాధానం దాటవేసే అవకాశం ఉందని హరీష్ రావు అన్నారు. ఎన్నికల కోడ్ రాకముందే ఆరు హామీల అమలు జరగాలని లేకపోతే ఇంకో నాలుగు నెలలు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన వెల్లడించారు. ఫిబ్రవరిలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టక పోతే ఆరు హామీల అమలు 100 రోజుల్లోజరగబోదు అని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఆరు హామీల గురించి పట్టించుకోకపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.