మా దేశం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోండి.. భారత్‌ను కోరిన మాల్దీవ్స్‌

-

భారత్, మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో తమ దేశంలో ఉన్న సైనికులను ఉపసంహరించుకోవాలని ద్వీపదేశమైన మాల్దీవ్స్ భారత్‌ను కోరింది. భారత వ్యతిరేక ధోరణితో పదవికి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు.. భారత సైనికులు వెళ్లిపోవాలని కోరుతున్నారు.చైనాతో సంబంధాల కోసం మొగ్గు చూపుతున్న ముయిజ్జు భారత్ మార్చి 15 లోగా తమ దేశం నుంచి సైనికులను ఉపసంహరించుకోవాలని అంటున్నారు. నాడు ఎన్నికల ప్రచారంలో ‘ఇండియా అవుట్’ నినాదంతో ముయిజ్జు ముందుకు సాగాడు.

తమ దేశ సార్వభౌమాధికారం కోసం కట్టుబడి ఉన్నామంటూ ప్రస్తుత మాల్దీవ్స్‌ ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నప్పటికీ చైనాతో అంటకాగుతున్నది. ఇదిలావుంటే… రీసెంట్ గా లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దాంతో ముగ్గురు మంత్రులను మాల్దీవ్స్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఈ క్రమంలో భారత్‌లో ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అంటూ ….ఇండియన్ టూరిస్టులు మాల్దీవ్స్ హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్‌ రద్దు చేసుకున్నారు. ఇదిలావుంటే చైనా పర్యటన నుంచి వచ్చిన తర్వాత తమను వేధించే హక్కు ఏ దేశానికి లేదని, తాము ఎవరికి బ్యాక్ యార్డ్ కాదని భారత్‌ను ఉద్దేశించి మాల్దీవ్స్‌ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వ్యాఖ్యానించారు. మాది చిన్న దేశమైనప్పటికీ తమను బెదిరించే లైసెన్స్ ఏ దేశానికి లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version