రాహుల్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన కేటీఆర్

-

తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేపథ్యంలో రాహుల్ గాంధీ శనివారం తెరాస ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ అదేస్థాయిలో బదులిచ్చారు. అంశాల వారీగా వివరిస్తూ రాహుల్ ఆరోపణలను తిప్పికొట్టారు… తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం మంత్రి కేటిఆర్ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం నాడు చేపట్టిన మార్పుల కారణంగానే ప్రాజెక్టుల అంచనా పెరిగిందన్నారు. అంబేద్క‌ర్ ప్రాణ‌హిత ప్రాజెక్టు పేరు మార్చార‌న‌డం శుద్ధ త‌ప్ప‌ని చెప్పారు. రాహుల్ గాంధీ విజ్ఞ‌త‌తో ఆలోచించి మాట్లాడాల‌ని సూచించారు. అంబేద్క‌ర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వ‌కుండా అవ‌మానించింది కాంగ్రెస్ పార్టీయేన‌ని ఆరోపించారు. తెలంగాణ నుంచి ప్రధాని పదవిని అధిరోహించిన పీవీనిపైతం కాంగ్రెస్ పక్కన పెట్టిందని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news