రిజర్వు బ్యాంక్ గవర్నర్ పై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కోకన్వీనర్ సంచలన వ్యాఖ్యలు…

-


ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం) భారతీయ రిజర్వ్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య శుక్రవారం చేసిన వ్యాఖ్యలతో కేంద్ర ప్రభుత్వం – ఆర్బీఐ మధ్య ఉన్న అంతర్గత విభేదాలు ఒక్క సారిగా బహిర్గతమయ్యాయి. దీంతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్‌పటేల్‌ తన పదవి నుంచి తప్పుకుంటారనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో . ‘‘ప్రభుత్వంతో ఉన్న విభేదాల గురించి ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు ఇతరులెవ్వరూ చర్చించకుండా చూసుకోవాలి అలా కుదరకపోతే మీరు రాజీనామా చేయడం సమంజసం అంటూ ఎస్‌జేఎం కో కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ వ్యాఖ్యానించడంతో ఆర్బీఐ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‍ ఎటు దారితీస్తుందో అని సర్వత్రా చర్చనీయాంశమైంది. గత కొద్ది రోజుల క్రితం సీబీఐ వంటి సంస్థపై కూడా కేంద్ర తమ ఆధిపత్యాన్ని నిరుపించుకోవాలని చూసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version