జనసేన పార్టీ అధినేత అధ్యక్షతన శుక్రవారం జనసేన అంతర్మథనం పేరుతో పార్టీ కార్యక్రమాల గురించి సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల్లోని నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడ కుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగి పార్టీ కార్యకలాపాలను ఇంకా ఎలా విస్తరించాలి, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటనల సందర్భంగా వివిధ వర్గాల నుంచి వస్తున్న స్పందనను పార్టీ నిర్మాణానికి ఏవిధంగా ఉపయోగించుకోవాలి తదితర అంశాలనపై అంతర్మథనం చేసుకోబోతోంది. పార్టీ అనుసరిస్తున్న విధానాలులతో పాటు లోపాలను తెలుసుకోనున్నారు.
ఇప్పటికే జనసేన రాయలసీమ నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు మినహా మిగిలిన చోట్ల సమన్వయకర్తలను నియమించింది. జనసేన అధినేత పర్యటనల సందర్భంగా ఎందరో అభిమానులు, యువత స్పందిస్తూ స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమన్వయకర్తలు ఈ క్యాడర్‌ను వెంటబెట్టుకుని వెళ్లి పార్టీని బలోపేతం చేసే విషయంలో, పార్టీ నిర్మాణం విషయంలో ఆశించినంతగా సఫలీకృతం కాలేకపోతున్నారనే అభిప్రాయంలో పవన్‌కల్యాణ్ ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజాపోరాట యాత్రలో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నప్పటికీ ఎన్నికల్లో విజయం దిశగా జనసేన ఎంత వరకు ఓటర్లను ఆకర్షింస్తుందనే విషయాన్ని సైతం నేడు అధినేతతో పార్టీ సమన్వయకర్తలు చర్చించనున్నారు.