వేల కోట్ల రుణాలు తీసుకునిసరైన సమయంలో చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపార వేత్త విజయ్మాల్యాకు బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ కోర్టులో ఎదురుదెబ్బతగిలింది. మాల్యాను భారత్‌కు అప్పగించే విషయంలో సోమవారంతీర్పు వెలువరించిన న్యాయస్థానం.. భారత ప్రభుత్వ వాదనను సమర్ధించింది.మాల్యా నుంచి రుణబకాయిలను వసూలు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియం న్యాయపరమైన చర్యలుప్రారంభించిన క్రమంలో 2016లో విజయ్ మాల్యా భారత్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకున్నసంగతి తెలిసిందే.
మాల్యాపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఈడీలు అతన్ని భారత్‌కుఅప్పగించాలని బ్రిటన్ కోర్టును ఆశ్రయించాయి. దీంతో నేడు భారత ప్రభుత్వం తరఫునబలంగా వాదనలు వినిపించారు. భారత్ వాదనలపై స్పందించిన మాల్యా… తనపై రాజకీయదురుద్దేశంతోనే కేసులు మోపారని, భారత జైళ్లలో దారుణ పరిస్థితులుఉంటాయని మాల్యా వెస్ట్‌మినిస్టర్ కోర్టులో వాదించారు. ఇరువైపుల వాదనలు విన్నకోర్టు మాల్యా నిజాలను దాచాడని నిర్దారించింది.