ఫోటోలు తీస్తే 72 లక్షల జీతం ఇస్తారట..!

-

Rich Family in UK, Looking to Hire a Travel Photographer

ఆఫర్ టెంప్టింగ్ గా ఉందా? ఒక్క ఫోటోలు తీస్తే 72 లక్షల జీతం ఇస్తారా? అని షాక్ అవుతున్నారా? అవును.. నిజంగానే మీరు ఫోటోలు తీయాలి.. మీకు సంవత్సరానికి 72 లక్షల జీతం ఇస్తారు. మీరు ఏదో కంపెనీకి పనిచేస్తారనుకుంటున్నారా? కానే కాదు. ఒక ఫ్యామిలీతో పాటు మీరు పని చేయాల్సి ఉంటుంది. వాళ్లు ఎక్కడికి వెళ్తే వాళ్లతో పాటు వెళ్లి అక్కడ వాళ్ల ఫోటోలు తీయాలి. అదే మీ జాబ్. అర్థమయిందా? కాకపోతే.. వాళ్లది యూకే.

వాళ్లది సంపన్న కుటుంబం. కోటీశ్వరులు. వాళ్లకు ఎక్కడెక్కడో ఇళ్లు ఉన్నాయి. దేశవిదేశాలు తిరుగుతూ ఉంటారు ఎప్పుడూ. మరి.. వివిధ ప్రదేశాలను తిరిగినప్పుడు ఆ ప్రదేశాలను తమ కెమెరాల్లో బంధించాలనుకుంటారు కదా. అందుకే.. ఓ ఫోటోగ్రాఫర్ ను నియమించాలనుకున్నారు. వీళ్లు అబుదాబి, రియో కార్నివాల్, మొనాకో లాంటి ప్రదేశాల్లో పర్యటించాలనుకుంటున్నారట. దాని కోసమే ఫోటోగ్రాఫర్ కోసం వెతుకుతున్నారు. ప్రిఫోకాల్ అనే వెబ్ సైట్ లో ఫోటోగ్రాఫర్ జాబ్ కు సంబంధించిన డిస్క్రిప్షన్ ను పొందుపరిచారు. ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటన ఇచ్చారు.

సెలక్టయిన ఫోటోగ్రాఫర్ కు సంవత్సరానికి లక్ష డాలర్ల జీతం ఇస్తారట. అంటే.. మన కరెన్సీలో 72 లక్షల రూపాయలు అన్నమాట. రోజులు నాలుగు గంటలే పని. సంవత్సరానికి ఓ 30 రోజులు మాత్రం సెలవులు ఇస్తారు అంతే. మిగితా సమయం మొత్తం ఆ ఫోటోగ్రాఫర్ ఆ కుటుంబంతోనే గడపాల్సి ఉంటుంది. 2019 ఫిబ్రవరిలో ఫోటోగ్రాఫర్ ను పెట్టుకొని తమ పర్యటనకు నాంది పలుకుతుందట ఆ కుటుంబం. ఆ ఉద్యోగానికి ఎవరు ఎంపిక అవుతారో కానీ.. వాళ్లు మాత్రం లక్కు తోకను తొక్కి వచ్చినట్టే లెక్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version