అయోధ్యంలో ఈ నెల 22న జరగబోయే రామాలయ ప్రారంభోత్సవం కార్యక్రమానికి బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వాని గారిని కూడా ఆహ్వానించారు. 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ నుంచి ప్రారంభమైన రథయాత్ర డిసెంబర్ 6, 1992న అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చేవరకు అద్వానీ రథయాత్ర సాగింది.అద్వానీతో పాటు మరో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిలు 1990లో రథయాత్రకు నాయకత్వం వహించారు.
జనవరి 22న ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే ఇదే రథయాత్ర సమయంలో నరేంద్ర మోడీ అద్వానీకి సహాయకుడిగా ఉన్నారు. ‘రాష్ట్రధర్మ’ అనే మ్యాగజైన్‌తో మాట్లాడిన అద్వానీ…… ఈ ఆర్టికల్ సోమవారం విడుదల కాబోతోంది. రామాలయం భారతీయులందరూ శ్రీరాముడి గుణాలను అలవర్చుకునేలా ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నట్లు అద్వానీ అన్నారు. రథయాత్ర సాగే సమయంలో తాను కేవలం ‘రథసారధి’ మాత్రమే అని భావించానని అద్వానీ తెలిపారు.ప్రధాని నరేంద్రమోడీకి అద్వాని అభినందనలు తెలియజేశారు.