షాకింగ్; 190 మందిని రేప్ చేసిన యువకుడు… పోలీసులకు కూడా దిమ్మ తిరిగింది…!

-

బ్రిటన్ లో దారుణం జరిగింది. ఒక యువకుడు 190 మంది మగాళ్ళ మీద రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఇండొనేసియాకు చెందిన ఓ యువకుడు 2007 సంవత్సరంలో చదువు కోసం బ్రిటన్ వెళ్ళాడు. అతనికి మగాళ్ళు అంటే చాలా ఆసక్తి… కోరికలు ఎక్కువగా ఉండటంతో ఎం చెయ్యాలో అర్ధం కాక మాంచెస్టర్ క్లబ్‌ను ఎంపిక చేసుకున్నాడు. తన కోరికలు తీర్చుకోవడానికి గాను వినూత్నంగా ఆలోచించాడు.

మాంచెస్టర్ క్లబ్‌లో ఫుల్లుగా తాగి ఇంటికి సరిగా వెళ్లలేని వారిని టార్గెట్ చేసాడు. తన ఇంట్లో వారికి ఉండటానికి సదుపాయం కల్పిస్తా అని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్ళే వాడు ఆ యువకుడు. వెళ్ళిన వెంటనే మత్తు మందు కలిపిన డ్రింక్ వారికి ఇచ్చే వాడు ఆ యువకుడు. ఆ తర్వాత వారి మీద పడి తన కోరికలు తీర్చుకునే వాడు. ఇలా దాదాపు 190 మందిని అతను రేప్ చేసాడు. ఈ క్రమంలో ఒక యువకుడిని టార్గెట్ చేసి షెల్టర్ ఇచ్చాడు.

అతడికి కూడా డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి అతడిని రేప్ చేస్తున్న క్రమంలో ఆ యువకుడికి మెలుకువ వచ్చింది. అత్యాచారాన్ని చూసి భయపడిన యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను 190 మందిని రేప్ చేసిన వీడియోలు చూసి పోలీసులు షాక్ అయ్యారు. వారిని స్టేషన్ కి పిలవగా తమకు ఎం తెలియదని చెప్పడం చూసి పోలీసులకు మైండ్ పోయింది. అతడికి కోర్ట్ యావజ్జీవ శిక్ష విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news