సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తమ సొంత అధికారులను అరెస్ట్ చేసి సంచలనం రేకెత్తించింది. సీబీఐ అధికారుల మధ్య చెలరేగిన వివాదం రానురాను రాజకీయ రంగు పులుముకుంటోంది.. వివాదం ముదరకముందే ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగి సంబంధిత సీబీఐ ఉన్నత స్థాయికి చెందిన ఇద్దరు అధికారులకు సమన్లు జారీ చేశారు. దీంతో వెంటనే స్పందించిన…అధికారులు కొన్ని గంటల వ్యవధిలోనే సీబీఐ డీఎస్పీని అరెస్టు చేశారు. తమ అధికారిని తామే అరెస్టు చేసి సీబీఐ మరో సంచలనానికి కారణమైంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరక్టర్ రాకేశ్ ఆస్థానాకు సమన్లు జారీ చేశారు. వారి నుంచి వివరణ కోరారు. స్వతంత్ర వ్యవస్థగా ఉన్న సీబీఐని సైతం ప్రధాని మోదీ ప్రభావితం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునేందుకు సీబీఐని ప్రధాని మోదీ ఓ ఆయుధంలా వాడుకున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు.