Lionel Messi :లియోనల్ మెస్సి… ఈ పేరు తెలియని ఫుట్ బాల్ అభిమానులు ఉండరు. అర్జెంటీనాకు ఎన్నో విజయాలు అందించిన మెస్సి 2022 ఖతార్ లో జరిగిన ఫుట్బాల్ వరల్డ్ కప్ ను తన దేశానికి అందించి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాడు. మెస్సీ ప్రపంచ కప్ ప్రయాణాన్ని యాపిల్ కంపెనీ డాక్యుమెంటరీగా రూపొందించింది. ‘మెస్సీస్ వరల్డ్ కప్ జర్నీ : రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ పేరుతో చిత్రీకరించిన ఈ డాక్యుమెంటరీ వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 21న ఈ రిలీజ్ కానుంది.మెస్సీ 17 ఏళ్ల కెరీర్లోని కొన్ని ఆసక్తికర విషయాలు, ముఖ్య సంఘటనలు ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తాయి. మెస్సీ తనపై వస్తోన్న డాక్యుమెంటరీపై స్పందింస్తూ….. నా కథని మీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉన్నా అని తెలిపారు. ఫుట్బాల్ అభిమానులు తమ ఆరాధ్య ఆటగాడిని తెరపై చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఖతార్లో జరిగిన వరల్డ్ కప్ తొలి మ్యాచ్లోనే సౌదీ అరేబియా చేతిలో ఓటమి పాలుకావడంతో మెస్సీ సేన పని అయిపోయినట్టే అనుకున్నారంతా. కానీ, ఆ ఓటమి నుంచి తేరుకున్న మెస్సీ సేన వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకెళ్లి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇక ఫైనల్లో అర్జెంటీనాకు ఫ్రాన్స్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, చివరికి షూటౌట్లో 4-2తో గెలిపించి అర్జెంటీనాను మూడోసారి విశ్వవిజేతగా నిలిపాడు.