చంద్రబాబుకు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదు : మంత్రి రోజా

-

చంద్రబాబుకు అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదు అన్నారు మంత్రి రోజా. విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడారు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబుకి అంబేద్కర్ ని తాకే అర్హత లేదన్నారు. దేశం లో ఏ సీఎం చేయని సామాజిక న్యాయం జగన్ చేస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు.

అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా జగన్ ఆచరిస్తున్నారని తెలిపారు. అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున సీఎం ఏర్పాటు చేశారని.. జగన్ అన్నకు వస్తున్న ప్రజా మద్దతు చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని.. చంద్రబాబు 100 అడుగుల విగ్రహం పెడతానని పెట్టకుండా అంబేద్కర్ ని అవమానించారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకొని చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news