సుస్మితాసేన్, రోహమాన్‌ షాల్‌కి బ్రేకప్ చెప్పిందా?

Join Our Community
follow manalokam on social media

సుస్మితాసేన్, న్యూ లవ్ స్టోరీ కూడా కంచికి చేరుతోందా.. మోడల్‌ రోహమాన్‌ షాల్‌కి కటీఫ్ చెప్తోందా.. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి పోస్ట్‌ పెట్టిందా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఇక సుస్మిత లేడీ సల్మాన్‌ ఖాన్‌లా మిగిలిపోవడమే కామెంట్‌ చేస్తున్నారు. ఇంతకీ సుస్మితా ఏం పోస్ట్‌ చేసింది.. ఆ పోస్ట్‌కి రోహమాన్‌కి సంబంధం ఏంటి?

సుస్మితా సేన్‌ లైఫ్‌లో ఇప్పటికే చాలా బ్రేకప్ స్టోరీస్‌ ఉన్నాయి. ఎర్లీ ట్వంటీస్‌ నుంచి ఫార్టీ క్రాస్‌ చేసేవరకు లవ్వులు, బ్రేకప్పులతోనే జర్నీ చేస్తోంది సుస్మిత. కెరీర్‌ బిగినింగ్‌లో డైరెక్టర్‌ విక్రమ్‌ భట్‌తో ప్రేమలో పడింది సుస్మిత. అయితే అప్పటికే పెళ్లైన విక్రమ్ భట్, సుస్మితని టైమ్‌పాస్‌లా చూశాడు గానీ, సీరియస్‌గా తీసుకోలేదు. పైగా సుస్మితతో ఎఫైర్ పెట్టుకుని నా భార్యని చాలా బాధపెట్టానని ఓపెన్ స్టేట్మెంట్స్‌ కూడా ఇచ్చాడు విక్రమ్ భట్.

సుస్మితా సేన్ బాలీవుడ్‌ హీరో రణ్‌దీప్ హుడాతో కూడా రిలేషన్‌లోకి వెళ్లింది. ‘కర్మ ఔర్ హోళి’ సినిమా టైమ్‌లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ డెవలప్ అయ్యిందనే వార్తలు కూడా వచ్చాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చుతూ ఇద్దరూ కలిసి ముంబాయి అంతా తిరిగేశారు. కానీ ఈ రిలేషన్‌ కూడా ఎక్కువకాలం సాగలేదు.

సుస్మితా సేన్ ముంబాయి బేస్డ్ బిజినెస్‌మెన్ రితిక్ భాసిన్‌తో రిలేషన్‌లో ఉందని కొన్నాళ్లు ప్రచారం జరిగింది. అలాగే పాకిస్థానీ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌ని పెళ్లి చేసుకుంటుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే వీటిని సుస్మిత బేస్‌లెస్‌ న్యూస్ అని కొట్టిపారేసింది. తర్వాత ‘దుల్హా మిల్ గయా’ డైరెక్టర్ ముదాస్సర్ అజీజ్‌తోనూ ప్రేమలో పడింది. అయితే సుస్మితతో తిరిగినన్ని రోజులు తిరిగి, మా ఫ్యామిలీ బాధ పడుతోందని సుస్మితకి కటీఫ్ చెప్పాడు ముదాస్సర్.

సుస్మితా సేన్ ఇప్పుడు తన కంటే 15ఏళ్లు చిన్నోడైన రోహమాన్ షాల్‌తో రిలేషన్లో ఉంది. రెండేళ్ల నుంచి సుస్మిత ఇంట్లోనే ఉంటున్నాడు రోహమాన్. ఇక రీసెంట్‌గా సుస్మిత ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టింది. మగవాళ్లు ప్రేమించిన ఆడవాళ్లని టేకిట్‌ గ్రాంటెడ్‌గా చూస్తారు. ఎన్ని తప్పులు చేసినా, క్షమిస్తారని భ్రమ పడతారు. కానీ ఆడవాళ్లకి నచ్చకపోతే ఆ బంధాన్ని కూడా వదిలేస్తారని పోస్ట్ పెట్టింది. దీంతో రోహమాన్‌తో రిలేషన్‌ చెడిందా అని అనుమానిస్తున్నారు నెటిజన్లు. మరి సుస్మితా ఈ పోస్ట్‌ ఎందుకు పెట్టిందో తెలియాలి.

 

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...