మహారాష్ట్రలో ఉద్ధవ్‌ సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయా ? 

-

మహరాష్ట్రలో రెండు సార్లు ప్రయత్నించి విఫలమైన బీజేపీ అధికారంలోకి రావడానికి మళ్లీ స్కెచ్‌ వేస్తోందా..ఈ సారి అమిత్‌ షా వ్యూహంలో శరద్‌ పవార్‌ పాత్ర ఉంటుందా..మహరాష్ట్రలో ఏం జరుగుతుంది..ఎన్సీపీతో బీజేపీ టచ్ లోకి వెళ్లిందా అన్న దానిపై మరాఠా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది…

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే.. బీజేపీకి కొరకరాని కయ్యగా తయారయ్యారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల్ని తప్పుబడుతున్నారు. ఎన్డీయే నుంచి వైదొలగి కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి అధికారంలోకి వచ్చిన ఠాక్రే.. బీజేపీకి బద్ధశత్రువులా వ్యవహరిస్తున్నారు. దీంతో ఉద్ధవ్‌కు ఎలాగైనా చెక్‌ పెట్టాలని కమలనాధులు స్కెచ్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్ధవ్‌ నుంచి ఎదురైన చేదు అనుభవాన్ని బీజేపీ ఇంకా మరిచిపోవట్లేదు. ఎలాగైనా బదులు తీసుకోవాలని టైమ్ కోసం చూస్తోంది.

ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యోచనలో అమిత్‌ షా ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే ఎన్సీపీ అధినేత పవార్‌తో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పవార్ ఎవరి పేరును సీఎం పదవికి ప్రతిపాదిస్తే వారినే సీఎం చేయడానికి కూడా బీజేపీ సిద్ధమైపోయిందట. దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం పవార్‌కు ఏమాత్రం ఇష్టంలేదని ఎన్సీపీ వర్గాలు చెప్పేసినట్లు సమాచారం.

ఎన్సీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాయని వచ్చిన వార్తల్ని ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ఖండించారు. అవి పుకార్లు మాత్రమేనని ఫైర్ అయ్యారు అజిత్ పవార్. శరద్‌ పవార్‌ మాత్రం ఇంకా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

కానీ, రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చు.. మరి మహా రాజకీయాలు ఎటువైపు మలుపు తీసుకుంటాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news