అతడి టెక్నిక్ ను ఫాలో అవుతా: సర్ఫరాజ్ ఖాన్

-

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ భారత జట్టుకు ఎంపిక అయినా సంగతి తెలిసిందే.ఇంగ్లండ్తో రెండో టెస్టుకు ఎంపికైన యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు ముషీర్ ఖాన్ తన కంటే మంచి బ్యాటర్ అని అన్నారు. ఫామ్లో లేని సమయంలో అతడి టెక్నిక్ ను గమనిస్తూ ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ముషీర్ రివర్స్ స్వీప్ తన కంటే బాగా ఆడతారని తెలిపారు. కాగా రెండో టెస్టుకు రాహుల్, జడేజా గాయంతో దూరమవడంతో సర్ఫరాజ్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

 

తుది జట్టులో అతనికి చోటు దక్కాలని అభిమానులు ఆశిస్తున్నారు. కాగా టీమ్ ఇండియాలోకి అతణ్ని తీసుకోకపోవడంపై కొన్నాళ్లుగా క్రికెట్ ఫ్యాన్స్ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల భారత్ A, ఇంగ్లండ్ లయన్స్ మధ్య జరిగిన రెండో అనధికారిక టెస్టులోనూ 161 పరుగులతో చెలరేగారు. ఎట్టకేలకు అతడికి బీసీసీఐ నుంచి పిలుపొచ్చింది. దీంతో అతడి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news