అన్నపూర్ణ దేవిగా అమ్మవారు

-

బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.. ఇందులో  భాగంగా ఆరో రోజైన సోమవారం దుర్గామ్మవారు అన్నపూర్ణ దేవి అవతారంలో  భక్తులకు దర్శనమిస్తున్నారు.  ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టుకుని ప్రజల ఆకలి దప్పులను తీర్చే తల్లిగా అన్నపూర్ణ దేవి రూపం ఆసాతం అపూరూపంగా ఉంది. ఆదివారం సెలవుదినం కావడంతో పాటు అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం కావడంతో నిన్ని దాదాపు మూడున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి దర్శనానికి రద్దీ తగ్గినప్పటికీ పోలీసులు ఆంక్షలు సడలించకపోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లకు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో వాహనాలను అనుమతించక పోవడంతో పిల్లలు, వృద్ధులతో అమ్మవారి దర్శనానికి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news