ఆధార్ చట్టబద్ధతపై సుప్రీం తీర్పు!

-

   ఆధార్‌ చట్టబద్ధత, చెల్లుబాటుపై సుప్రీం కోర్టుకు చెందిన ఐదుగురు సీనియర్‌ న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించనుంది. ఆధార వల్ల పౌరుడి వ్యక్తిగత సమాచారంతో పాటు ఆర్థిక విషయాల్లో గోప్యతకు భద్రత ఉండదని వివిధ వర్గాలకు చెందిన పౌరుల నుంచి నిరసనలు వెళ్లువెత్తాయి. దీనిపై రాజ్యాంగం పౌరుడికి ప్రసాదించిన గోప్యత హక్కును ఆధార్‌ ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ దాని చట్ట బద్దతను సవాల్‌చేస్తూ దాఖలైన దాదాపు 27 పిటిషన్లపై సుప్రీం కోర్టు రికార్డు స్థాయిలో 38 రోజులు విచారణ జరిపింది..

”గోప్యత జీవితంలో అంతర్భాగమని, వ్యక్తి గత స్వేచ్ఛ’ అని గతంలో  సుప్రీం కోర్టు రూలింగ్‌ ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 పౌరుడికి గోప్యత హక్కును కల్పిస్తోంది.  వ్యక్తి గత గోప్యతని ఆధార్ రూపంలో బహిర్గత పర్చడంతో భవిష్యత్ లో అనేక అనార్థాలు చోటుచేసుకుంటాయని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news