ఆరు గ్యారెంటీలు ఎలా అమలు చేస్తారు?….. అనుమానాలు నివృత్తి చేయండి -బండి సంజయ్‌

-

నూతన ప్రభుత్వాన్ని ఏర్పరిచిన కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు.కేవలం లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దరఖాస్తులకే పరిమితం కావద్దని బండి సంజయ్‌ సూచించారు. సోమవారం కరీంనగర్‌లో నిర్వహించిన మాజీ ప్రధాని వాజ్‌పేయ్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.

అనంతరం విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ… కాంగ్రెస్‌ ప్రభుత్వం. 6.75 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పారని , మరి అప్పులు ఎలా తీరుస్తారు అని 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో తెలపాలని ఆయన డిమాండ్‌ చేశారు.ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు ఉన్న సందేహాలను , వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. దేశాన్ని ఐదు దశాబ్దాల వరకు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ రూపాయి విడుదల చేస్తే కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు అందేవని, మిగతావి దళారుల చేతికి వెళ్లేవని ఈ విషయాన్ని స్వయంగా రాజీవ్ గాంధీ చెప్పారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news