నాకో 2-3 కోట్లు ఇవ్వండి.. చేతులు జోడించి గంభీర్‌ను వేడుకున్న టీవీ ప్ర‌జెంట‌ర్.. వీడియో వైరల్

-

 

ఇటీవల దుబాయ్ వేదికగా ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఈ వేలంలో మిచెల్ స్టార్క్ ని ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు కోల్కత్తా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ దక్కించుకొని రికార్డ్ సృష్టించింది.ఏకంగా 24.75 కోట్లకి కొనుగోలు చేసింది. వేలంలో పాల్గొన్న గంబిర్ మిచెల్ స్టార్క్ కోసం ఎన్ని కోట్లు అయినా పెట్టడానికి వెనుకాడ వద్దని కోల్కత్తా యజమాన్యానికి తెలిపారు.తొలుత స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పాట్ కమ్మీన్స్ ని ద‌క్కించుకోవ‌డంతో స్టార్ పేస‌ర్ అయిన స్టార్క్‌పై కోల్కతా క‌న్నేసింది. అతడి కోసం రాయ‌ల్ చాలెంజ‌ర్స్,గుజ‌రాత్ టైటాన్స్ పోటీప‌డినా కోల్‌క‌తా త‌గ్గ‌లేదు.

అయితే తాజాగా ఒక టీవీ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న గంభీర్‌ను టీవీ ప్ర‌జెంట‌ర్ జతిన్ స‌ప్రూ స్టార్క్ కోసం కోట్లు కుమ్మ‌రించ‌డం గురించి గౌతీని అడిగాడు. సరదాగా చేతులు జోడించి దేవుడా ద‌య‌చేసి నాకు రూ.2 లేదా రూ.3 కోట్లు ఇవ్వండి’ అని గౌతిని వేడుకున్నాడు. టీవీ ప్రెసెంటర్ అలా అడగడంతో గంభీర్ పగలబడి నవ్వుకున్నాడు. 15 సెకండ్లు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news