ఆ విద్యార్థుల మరణానికి ‘ఆర్ఎక్స్ 100’ సినిమానే కారణం! డీఎస్పీ

-

సంచలనం రేకెత్తించిన జగిత్యాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు మహేందర్, రవితేజల మరణం వెనుక ఓ తెలుగు సినిమానే ఉందనే విషయాన్ని డీఎస్పీ వెల్లడించారు. కేసును విచారిస్తున్న డీఎస్పీ వెంకటరమణ విచారణలో ఆశ్చర్యం కలిగించే విషయాలను మీడియాకు వెల్లడించారు. ప్రేమ వ్యవహారం కారణంగానే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారని డీఎస్పీ తెలిపారు.   ఇటీవల విడుదలైన ‘ఆర్ఎక్స్ 100’ సినిమా స్ఫూర్తితోనే వీరిద్దరూ చనిపోయారని చెప్పారు. వారివి హత్యలు కాదని, ఆత్మహత్యలని చెప్పారు. వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాను ఆధారంగా కేసును మరింత లొతుగా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

ఇద్దరు కలిసి పెట్రోల్ ని కొనుగోలుచేసి తాగిన మైకంలో ఆర్ఎక్స్ 100 సినిమా గురించి చర్చించుకుని ఒకరిపై మరొకరు పెట్రోల్ పోసుకుని ఆత్యహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందగా, కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రవితేజ ప్రాణాలు వదిలాడు అని తెలిపారు. ఈ కేసుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

దర్యాఫ్తు ప్రారంభ స్థాయిలోనే ఉంది..పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత వాస్తవాలను వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. ఇద్దరు కలిసి ఓకే అమ్మాయిని ప్రేమించారని  కొంత మంది పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని పోలీసుల వద్ద ప్రస్తావించగా ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు ఉన్నాయని వారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news