ఈగల్ రిలీజ్ రోజే దిగుతున్న లాల్ సలాం సినిమా….

-

గత ఏడాది నెల్సన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ రజనీకాంత్ కెరీర్ లోనే భారీగా వసూళ్లను రాబట్టి రజినీ కమ్ బ్యాక్ మూవీ గా నిలిచింది. జైలర్ సినిమా ఇచ్చిన జోష్ లో రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రజినీకాంత్ హీరోగా ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లాల్ సలామ్. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

చాలా రోజుల తర్వాత తండ్రీకూతుళ్ల కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో లాల్ సలామ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నందుకు ఈగల్ చిత్రానికి ఫిబ్రవరి 9న సోలో విడుదల తేదీ ఇచ్చారు. ఫిబ్రవరి 8న యాత్ర 2 సినిమా రిలీజ్ అవుతుండగా అదే రోజు ఊరి పేరు భైరవ కోన కూడా విడుదల కి సిద్ధం అవుతుంది. ఇక ఇప్పుడు లాల్ సలాం కూడా అదే డేట్ కి వస్తుంది. రజినీకాంత్ మరోవైపు టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం లో తలైవా 170 సినిమా తో పాటు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో తలైవా 171లో కూడా నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news