గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్ జీతం ఎంతుంటుందని అనుకుంటున్నారు.. అక్షరాల ఆయన జీతం సంవత్సరానికి 1,663 కోట్లు. అంటే నెలవారీ జీతం దాదాపు రూ.150 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు.అంటే ఈ లెక్కన రోజుకు రూ.5 కోట్లు సంపాదిస్తున్నాడు.రోజుకు రూ. 5 కోట్లు సంపాదిస్తున్న సుందర్ పిచాయ్ లాంటి గొప్ప వ్యక్తి చిన్న తనంలో క్రికెటర్ గా కావాలనుకు న్నాడట. చెన్నెలోని తాను చదువుకున్న పాఠశాల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా చాలా టోర్నమెంట్ లు గెలుచుకున్నాడు. అయితే టీ20 ఫార్మాట్ అంటే అస్సలు ఇష్టం లేదని సుందర్ పిచాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి మెటలర్జికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసిన తర్వాత పై చదువుల కోసం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ, వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియాకు వెళ్లాడు. 2004లో గూగుల్ కంపెనీలో వివిధ పోస్టుల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అనేక ఆవిష్కరణలకు నాయకత్వం వహించి అక్టోబర్ 2015లో Google CEO గా 2017లో పిచాయ్ ఆల్ఫాబెట్స్ డైరెక్టర్ నియమితులయ్యారు.