తెలంగాణాలో ఎన్నికలకు సమయం చాలా డాగర పడింది, అధికారంలో కేసీఆర్ మరోసారి గెలిచి సీఎం అవ్వాలని కలలు కంటున్నారు. మరోవైపు బీజేపీ మరియు కాంగ్రెస్ లు అధికారం కోసం కాచుకు కూర్చున్నారు. కాగా ఇటువంటి ఎన్నికల సమయంలో మాజీ ఐఏఎస్ అధికారి ఏ కె గోయల్ ఇంట్లో డబ్బు మరియు మద్యం ఉన్నాయన్న ఫిర్యాదుతో ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఆయన ఇంటిని తనిఖీ చేయగా, చివరకు అక్కడ ఏమీ లేదని నిర్దారించుకుని వెళ్లిపోయారు. అనంతరం గోయల్ మాట్లాడుతూ నాపైన కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలపై నేను పరువు నష్టం దావా వేస్తానంటూ రెచ్చిపోయి మాట్లాడారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విషయంపై నా ఇంటి ముందు ఆందోళనలు చేశారంటూ బాధపడ్డారు గోయల్. ఇక కాంగ్రెస్ నేతలు మల్లు రవి, అజారుద్దీన్, విజయారెడ్డి లు నాపిల్ తప్పుడు ఆరోపణలు చేసినట్లు చెప్పారు గోయల్.
అయితే ఇలా ఎన్నికల సమయం కావడంతో సందేహాలు రావడం సహజమే, అంతమాత్రాన వారిపై తప్పుడు ఆరోపణలు అంటూ మాట్లాడడం సరైందేనా ?