తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులు మాత్రమే ఉండడంతో పార్టీలు పోటీ పడి మరీ ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఈ రోజు ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ మరోవైపు హోమ్ మినిస్టర్ అమిత్ షా లు ప్రచారాలను నిర్వహిస్తూ ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తాజాగా తుక్కుగూడ సభలో మోదీ మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మరియు BRS లను నమ్మడానికి వీలులేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మరియు కేసీఆర్ ఇద్దరూ కూడా మిత్రులు లాంటి వారని మోదీ తెలియచేశారు. కాంగ్రెస్ మరియు BRS లు రెండూ ఒకే నాణేనికి రెండు ముఖాల్లాంటి వారంటూ మోదీ బట్టబయలు చేశారు. వీరిద్దరికీ అభివృద్ధి గురించి ఆలోచించడం చేతకాదు కానీ..
ఏకైక లక్ష్యం నన్ను తిట్టడమే అయి ఉంటుంది అంటూ మోదీ విమర్శించారు.
ఎన్నో హామీలను ప్రజలకు ఇస్తున్న బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతారా ? లేదా కాంగ్రెస్ కు మరో ఛాన్స్ ఇస్తారా అన్నది తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే.