తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. మల్లారెడ్డి ఏం మాట్లాడినా సెన్సేషన్.. ఏం చేసినా ఏదో ఒక వైబ్రేషన్ అన్నట్టుగా ఉంటుంది.తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. రిపబ్లిక్ డే పురస్కరించుకొని మేడ్చల్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…… తెలంగాణ ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఓ విలేకరి మల్లారెడ్డినీ మీరు పార్టీ మారుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపిలోకి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి… మరి ఈ వార్త నిజమేనా అని ….ఆ వార్తలపై మీరేమంటారు అని ప్రశ్నించారు. విలేఖరి అడిగిన ప్రశ్నకు మల్లారెడ్డి నవ్వూతూ స్పందిస్తూ..నేను బీజేపీలోకి పోతా….నేను కాంగ్రెస్ పార్టీలోకి పోతా…. అన్ని పార్టీలు మనవే అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం మల్లారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కెర్లు కొడుతుంది.